RGV Interesting Comments About Kiccha Sudeep Vikrant Rona Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Vikrant Rona Movie: సుదీప్‌ కెరీర్‌లో ఇదే బెస్ట్‌ : రామ్‌గోపాల్‌ వర్మ   

Jun 26 2022 7:56 AM | Updated on Jun 26 2022 10:39 AM

Ram Gopal Varma Comments About Sudeep Kiccha Vikrant Rona Movie - Sakshi

‘‘కన్నడ ఇండస్ట్రీ అంటే ఏదో చిన్న పల్లెటూర్లో సినిమాలు తీస్తున్నారనే ఫీలింగ్‌ గతంలో ఉండేది. కానీ, ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీకే కాదు.. ఇండియన్‌ సినిమాకే ఓ బెంచ్‌ మార్క్‌ను క్రియేట్‌ చేస్తోంది. ఈ మధ్య ‘కేజీఎఫ్‌ 2’ వచ్చింది.. ఇప్పుడు ‘విక్రాంత్‌ రోణ’ వస్తోంది. సుదీప్‌ కెరీర్‌లో ఇదే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అనుకుంటున్నాను’’ అని డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు.

సుదీప్‌ హీరోగా జాక్వలైన్‌ ఫెర్నాండెజ్, నిరూప్‌ భండారి, నీతా అశోక్‌ ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. సల్మాన్‌ ఖాన్‌ ఫిలింస్‌ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్‌, షాలినీ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై జాక్‌ మంజునాథ్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.

‘‘ఈ సినిమాకు సుదీప్‌గారు పిల్లర్‌గా నిలబడి సపోర్ట్‌ చేసినందుకు థ్యాంక్స్‌’’ అన్నారు అనూప్‌ భండారి. ‘‘భారతీయ సినిమా మరిన్ని కొత్త చరిత్రలను సృష్టిస్తుంది’’ అన్నారు నిర్మాత షాలినీ మంజునాథ్‌. ‘‘విక్రాంత్‌ రోణ’ చిత్రం కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాత్‌ బ్రేకింగ్‌ మూవీ అవుతుంది. ఓ సౌత్‌ ఇండియన్‌గా ఎంతో గర్వపడుతున్నాను’’ అన్నారు అఖిల్‌ అక్కినేని. కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ– ‘‘ఈగ’ వంటి సినిమాను నాకు ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్, రాజమౌళిగార్లకు థ్యాంక్స్‌. అలాగే నా తెలుగు జర్నీకి ఓ కారణమైన రామ్‌గోపాల్‌ వర్మగారు ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. జూలై 28కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, ఫైట్‌ మాస్టర్‌ విజయ్, గాయని మంగ్లీ తదితరులు పాల్గొన్నారు.  

   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement