Ram Gopal Varma: Chandrababu Naidu Tears After Watching RGV Missing Trailer - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న చంద్ర‌బాబు!

Nov 19 2021 9:45 PM | Updated on Nov 20 2021 12:43 PM

Ram Gopal Varma: Chandrababu Naidu Tears After Watching RGV Missing Trailer - Sakshi

ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు' అని చంద్ర‌బాబు చెప్తూ క‌న్నీళ్లు పెట్టు...

Ram Gopal Varma Satires On Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్ర‌బాబు నాయుడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యం తెలిసిందే! మ‌ళ్లీ సీఎం అయ్యేవ‌ర‌కు అసెంబ్లీలో అడుగు పెట్ట‌న‌ని శ‌ప‌థం చేశాడు. అయితే బాబు తాను రూపొందించిన‌ "ప‌వ‌ర్ స్టార్‌ ఆర్జీవీ మిస్సింగ్" ట్రైల‌ర్ చూసే ఏడ్చేశాడంటున్నాడు ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు.

చంద్ర‌బాబు ఏడుస్తున్న క్లిప్‌ను క‌ట్ చేసి, ఆయ‌నే మాట్లాడుతున్న‌ట్లుగా ఓ మిమిక్రీ వాయిస్‌ను జ‌త చేశాడు. 'ఇందాకే ఆర్జీవీ మిస్సింగ్ ట్రైల‌ర్ చూడ‌టం జ‌రిగింది. ఇది ఏ విధంగా అభివ‌ర్ణించాలో నాకేతై అర్థం కావ‌డం లేదు' అని చంద్ర‌బాబు చెప్తూ క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా ఉంది. దీనికి వ‌ర్మ‌.. 'ఇందాకే బాబు ట్రైల‌ర్ చూశారు. ఆయ‌న స్పంద‌న‌కు ధ‌న్య‌వాదాలు' అని క్యాప్ష‌న్‌లో రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. ఈ ర‌కం ప్ర‌మోష‌న్స్ తామెక్క‌డా చూడ‌లేదు అని ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదిలా వుంటే `ఆర్జీవి మిస్సింగ్‌` చిత్రాన్ని భీమవరం టాకీస్‌ పతాకంపై ఛటర్జీ నిర్మిస్తున్నారు. అధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.ఇందులో పవన్ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు, చిరంజీవి వంటి వారి పాత్రలను సెటైరికల్‌గా చూపించారు వర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement