సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రేంజ్‌లో రామ్‌ చరణ్‌ డ్రైవర్‌ నెల జీతం, ఎంతంటే!

Ram Charan Car Driver Monthly Salary Goes Viral - Sakshi

కరోనా కారణంగా ఎంతోమంది ఉపాధిని కొల్పోయారు. ఆయా రంగాలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు జాబ్స్‌ పోయి నిరుద్యోగులుగా మారారు. ఇక కొన్ని కంపెనీలో ఉద్యోగుల జీతాల్లో కోతలు వేశారు. ఇలా కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఎంతోమంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానీ సినీ సెలబ్రెటీలకు దగ్గర పనిచేసే స్టాఫ్‌పై మాత్రం కరోనా ఎఫెక్ట్‌ తక్కువగానే పడింది. దీంతో అందరి దృష్టి మన స్టార్‌ల వద్ద పనిచేసే ఉద్యోగులపై, వారి జీతాలపై పడింది. ఈ క్రమంలో హీరోహీరోయిన్ల దగ్గర పనిచేసే కారు డ్రైవర్లు, బాడీగార్డుల నెల జీతాలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ నేపథ్యంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కారు డ్రైవర్‌ జీతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే మెగా కుటుంబం ఇంట్లో పని చేసే స్టాఫ్‌కు ఎలాంటి కోరత ఉండదు. వారి దగ్గర పనిచేసే వారిని మెగా కటుంబంగా సొంతవాళ్లల ఆదరిస్తుంది. జీతంతో పాటు పండగలకు, స్పెషల్‌ డేస్‌, బర్త్‌డేలకు వారికి బోనస్‌లు ఇస్తుంటారట. తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల బాధ్యత తమది అన్నట్టుగా భావిస్తాడట చెర్రి. అందుకే తన స్టాఫ్‌కు భారీగా జీతాలు ఇస్తాడట. ఇక తన కారు డైవర్‌కు అయితే దాదాపు రూ. 45 వేల పైనే వేతనం ఇస్తాడని సమాచారం.

అంటే ఓ సాఫ్ట్‌వేర్‌ బెసిక్‌ శాలరీకి సమానంగా చెర్రి తన కారు డ్రైవర్‌కు జీతం ఇవ్వడం నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే బయటకు వెళ్లినప్పుడు ఎక్కువ శాతం చెర్రియే స్వయంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళతాడు. డ్రైవర్‌ను అతి తక్కువ సమయంలోనే తనతో పాటు తీసుకు వెళతాడు. అలాంటిది అంతగా జీతం ఇవ్వడమంటే ఆశ్చర్యమే కదా. అయితే కేవలం డ్రైవర్‌కు మాత్రమే కాదు ఇంట్లో పని చేసే పనివాళ్లకు కూడా బాగానే జీతం ఉంటుందట. కాగా ప్రస్తుతం చరణ్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచిపోయిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైంది. దీనితో పాటు శంకర్‌ డైరెక్షన్‌లో ఓ పాన్‌ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top