తెలుసు కదా.. బై బై! | Raashi Khanna has completed the shoot for her role in Telusu Kada movie | Sakshi
Sakshi News home page

తెలుసు కదా.. బై బై!

Sep 8 2025 12:06 AM | Updated on Sep 8 2025 12:06 AM

Raashi Khanna has completed the shoot for her role in Telusu Kada movie

‘తెలుసు కదా’ యూనిట్‌కు బై బై చెప్పారు రాశీ ఖన్నా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న రొమాంటిక్‌ డ్రామా ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్‌ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 17న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర షూట్‌ను పూర్తి చేశారు రాశీ ఖన్నా.

ఈ సందర్భంగా ‘తెలుసు కదా’ సినిమా ప్రయాణం గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ –‘‘కెమెరాలు ఆగి పోయిన తర్వాత కూడా మర్చి పోలేని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలు కలగలిసిన ప్రయాణం ఇది. ఇందులో నాతో పాటు నడిచిన చిత్రయూనిట్‌ అందరికీ కృతజ్ఞతలు. మేము సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్‌లా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement