PSPK Rana Movie: సంక్రాంతికి పవన్, రానా మల్టీస్టారర్

BheemlaNayak: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన అందిస్తుడటం విశేషం.
తాజాగా చిత్రయూనిట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. సంక్రాంతి బరిలోకి పవన్, రానా మూవీ వస్తోందని వెల్లడించింది. ఈ మేరకు మేకింగ్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో పవన్ భీమ్లా నాయక్ అనే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్ ఆర్మీ ఫీసర్ పాత్రను చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా పవన్.. క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. తాజాగా మల్టీస్టారర్ మూవీ కూడా సంక్రాంతి విడుదలకు సై అనడంతో హరిహర వీరమల్లు రిలీజ్ డేట్‌లో ఏమైనా మార్పులుంటాయేమో చూడాలి!
Power Star as #BheemlaNayak, will take charge Sankranthi 2022 🔥
Here's a small glimpse from the sets of #ProductionNo12 💫
Power Star @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @dop007 @vamsi84 @NavinNooli
— Sithara Entertainments (@SitharaEnts) July 27, 2021