దిల్‌ రాజు కొడుకు పేరేంటో తెలుసా ? | Sakshi
Sakshi News home page

Dil Raju: దిల్‌ రాజు కుమారుడి పేరు ఇదేనట !

Published Wed, Jul 13 2022 9:16 PM

Is Producer Dil Raju Reveals His New Born Son Name - Sakshi

Is Dil Raju Reveals His New Born Son Name: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో దిల్‌ రాజు ఒకరు. ఆయన ఇ​​టీవల మరోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. దీంతో దిల్‌ రాజు ఇంటికి వారసుడొచ్చాడని నెటిజన్లు, టాలీవుడ్‌ సెలబ్రిటీలు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే దిల్‌ రాజు కుమారుడికి అద్భుతమైన పేరు పెట్టినట్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. దిల్‌ రాజు వారసుడికి 'అన్వి రెడ్డి' అని నామకరణం చేసినట్లు సమాచారం. 

అయితే దిల్‌ రాజు మొదటి భార్య అనిత పేరు కలిసివచ్చేలా ఈ పేరు పెట్టినట్లు టాక్. ఈ పేరు విషయంలో దిల్‌ రాజు రెండో భార్య తేజస్వినికి ఎలాంటి ఇబ్బందిలేదని, అలాగే సంస్కృతంలో కూడా ఆ పేరుకు మంచి అర్థం ఉండటంతో అడ్డుచెప్పలేదట. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్‌ 10, 2020న నిజామాబాద్‌లో దిల్‌ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. 

చదవండి: ఘోరంగా ఉన్న నిన్ను సినిమాల్లోకి ఎలా తీసుకుంటున్నారో?..
నితిన్‌ పాటకు మహేశ్‌ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్‌
ఆ పుకార్లు నిజమే.. తేల్చి చెప్పేసిన రష్మిక మందన్నా..


Advertisement
 
Advertisement
 
Advertisement