
ప్రెజర్ కుక్కర్, యశోద సినిమాల్లో నటించింది. ఇటీవల శశికుమార్ హీరోగా నటించిన అయోధి చిత్రంలో ప్రీతి ఇస్రాణిని నాయకిగా నటించింది. గత మార్చి నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
ఏ రంగంలోనైనా సక్సెస్ చాలా ముఖ్యం. విజయంతోనే పేరు, అవకాశాలు. అలా ఇటీవల డాడా చిత్రంతో విజయాన్ని అందుకున్న నటుడు కవిన్ తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు సతీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి కిస్ అనే టైటిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కాగా ఇందులో కవిన్‌కు జంటగా కుక్ విత్ కోమాలి ఫేమ్ ప్రీతి ఇస్రాణిని కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈమె ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించింది. ప్రెజర్ కుక్కర్, యశోద, దొంగలున్నారు జాగ్రత్త సినిమాల్లో నటించింది. ఇటీవల శశికుమార్ హీరోగా నటించిన అయోధి చిత్రంలో ప్రీతి ఇస్రాణిని నాయకిగా నటించింది. గత మార్చి నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది ప్రీతి. కాగా ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు కవిన్‌కు జంటగా కిస్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఇందులో నటి కుష్బూ ముఖ్య పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
చదవండి: షూటింగ్‌లో వీజే సన్నీకి గాయాలు