బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే మృతి | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే మృతి

Published Fri, Feb 2 2024 12:03 PM

Poonam Pandey Passed Away - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నటి పూనమ్ పాండే (32) మృతి చెందారు. గత రాత్రి మరణించినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా ఆమె అనుచరులు ఒక పోస్ట్‌ చేశారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో ఆమె మరణ వార్త మొదటగా వెల్లడైంది. ఆమె మరణ వార్త గురించి పూనమ్‌ పాండే పీఆర్‌ టీమ్‌ ఇలా తెలిపింది. 'ఈ ఉదయం మాకెంతో చాలా కఠినమైనది. మా ప్రియమైన పూనమ్‌ పాండేను కోల్పోయాం. సర్వైకల్ (గర్భాశయ)  క్యాన్సర్‌తో చికిత్స తీసుకుంటూ మరణించారు. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిపట్ల స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయతలను పంచారు. ఈ దుఃఖ సమయంలో,  ఈ విషయాన్ని మేము షేర్‌ చేసేందుకు ఎంతో చింతిస్తున్నాము. ఆమె ప్రేమను ఎప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం.' అని అందులో ఉంది.

పూనమ్ ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూనమ్ మరణ వార్తను ఆమె పీఆర్ టీమ్‌ మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది.  త్వరలోనే అన్ని విషయాలు చెబుతామని వారు తెలిపారు. 

పూనమ్ పాండే ప్రముఖ మోడల్‌గా గుర్తింపు పొందారు. 2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు ఒక వీడియో సందేశంలో భారత్ ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తన దుస్తులు తొలగిస్తానని ఆమె కామెంట్‌ చేసి వైరల్‌ అయ్యారు. 2013లో 'నాషా' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పూనమ్‌ తెలుగులో 'మాలిని అండ్ కో'లో  నటించింది.  సినిమాల కంటే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు.

ఢిల్లీలో జన్మించిన పూనమ్‌. అక్కడే పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఇంటర్మీడియట్ తర్వాత మోడలింగ్ చేయసాగింది. 2010లో గ్లాడ్‌రాక్స్ పత్రిక నిర్వహించిన అందాల భామల పోటీలో తొలి 8 మందిలో ఆమె నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అక్కడ పాపులారిటీ రావడంతో ఎక్కువగా అర్ధనగ్న ఫోటోలు షేర్‌ చేస్తూ వివాదాస్పద నటిగా మిగిలింది. ఆమె వైవాహిక జీవితం చుట్టూ కూడా అనేక గొడవలు జరిగాయి. భర్త తనను శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ అప్పట్లో పోలీసులను ఆశ్రయించడమే కాకుండా అతని నుంచి విడాకులు కూడా తీసుకుంది. అప్పటి నుంచి ఒంటరిగానే పూనమ్‌ జీవిస్తుంది. 


(పూనమ్‌ పాండే అరుదైన చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

Advertisement

తప్పక చదవండి

Advertisement