దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే? | Police Finds Key Information In Kannada Hero Darshan's Case | Sakshi
Sakshi News home page

Darshan Case: హీరో దర్శన్ కేసు.. హత్య అనంతరం తన భార్యతో కలిసి!

Published Thu, Jun 20 2024 8:07 PM | Last Updated on Thu, Jun 20 2024 8:13 PM

Police Finds Key Information In Kannada Hero Darshan's Case

కన్నడ హీరో దర్శన్ కేసు శాండల్‌వుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా దర్శన్‌ భార్య విజయలక్ష్మిని సైతం పోలీసులు విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆమె ఉంటున్న ఫ్లాట్‌లో దర్శన్‌ షూస్ గుర్తించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నప్పటికీ ఆమె నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో ఆమెను ప్రశ్నించారు.

అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రేణుకాస్వామి హత్యం అనంతరం దర్శన్‌ తన భార్య విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడే భార్యతో కలిసి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత దర్శన్‌ మైసూరుకు వెళ్లిపోయాడు. అయితే ఈ కేసులో ఆయన భార్యను దాదాపు ఐదుగంటల పాటు విచారించిన పోలీసులు ఆమె పేరును సాక్షిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. 
కాగా.. ఈనెల 9న బెంగళూరులో రేణుకాస్వామి అనే అభిమాని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హీరో దర్శన్‌తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ, మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement