
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ముందుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ పూర్తయిన తర్వాత ‘ఆచార్య’ చిత్రీకరణలో జాయిన్ అవ్వాలన్నది చరణ్ ప్లాన్. కానీ కోవిడ్ వల్ల ప్లాన్ మారిందని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో జాయిన్ అయ్యే ముందే ‘ఆచార్య’లో తన భాగాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ పాత్రలో చరణ్ కనిపిస్తారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. 2021 వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.