Ooriki Utharana Movie Streaming On Amazon Prime Video, Here Details - Sakshi
Sakshi News home page

Ooriki Utharana Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఊరికి ఉత్తరాన.. కానీ ఫ్రీగా కాదు!

May 3 2023 11:23 AM | Updated on May 3 2023 3:26 PM

Ooriki Utharana Streaming On Amazon Prime Video - Sakshi

ఈ సినిమా కోసం వరంగల్ సెట్ వేసి చిత్రీకరణ చేశాం. అది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనసుల్ని హత్తుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి చక్కటి

నరేన్ వనపర్తి, దీపాళి శర్మ నటించిన చిత్రం 'ఊరికి ఉత్తరాన'. తన బృందంతో కలిసి సతీష్ దర్శకత్వం వహించారు. వనపర్తి వెంకటయ్య నిర్మించారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సదర్భంగా దర్శకుడు మాట్లాడుతూ "గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమతోపాటు, ఆసక్తి రేకెత్తించే అంశాలు పుష్కలంగా ఉన్నాయ"న్నారు.

కథానాయకుడు నరేన్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం వరంగల్ సెట్ వేసి చిత్రీకరణ చేశాం. అది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనసుల్ని హత్తుకునే కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి చక్కటి వినోదం పంచుతుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం రూ.79 చెల్లించి ఈ సినిమా ఇంటిల్లిపాది చూడొచ్చు. ప్రస్తుతం ఈగల్ ఐ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఓ కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్లు" తెలిపారు.

చదవండి: ఏజెంట్‌.. రిలీజైన మూడు వారాల్లోకే ఓటీటీలోకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement