ట్రెండింగ్‌లో NKR21.. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ!

NKR 21: Nandamuri Kalyan Ram Announced New Movie - Sakshi

కొత్త సినిమా కబురు చెప్పారు హీరో కల్యాణ్‌రామ్‌. ఆయన హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఫిల్మ్‌ రూపొందనుంది. జూలై 5న (బుధవారం) కల్యాణ్‌రామ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ వర్థన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు.

(కల్యాణ్ రామ్ 'డెవిల్' గ్లింప్స్.. డైరెక్టర్ పేరు లేకుండానే!

కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో ఇది 21వ సినిమా. కాబట్టి  #NKR21 పేరుతో సినిమాను అనౌన్స్‌ చేస్తూ పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో రక్తంతో తడిసిన కళ్యాణ్ రామ్ చేతిని చూడవచ్చు. మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కల్యాణ్‌ రామ్‌ కనిపించబోతున్నారట.  ‘‘కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న సినిమా ఇది. అవుట్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top