దిల్ రాజు నయా ప్లాన్.. నాని ప్లేస్‌లో నితిన్‌, వర్కౌట్‌ అయితే కాసుల వర్షమే! | Nithiin To Act In Nani MCA Sequel | Sakshi
Sakshi News home page

దిల్ రాజు నయా ప్లాన్.. నాని ప్లేస్‌లో నితిన్‌, వర్కౌట్‌ అయితే కాసుల వర్షమే!

Published Wed, Mar 22 2023 2:38 PM | Last Updated on Wed, Mar 22 2023 2:45 PM

Nithiin To Act In Nani MCA Sequel - Sakshi

టాలీవుడ్ లో సీక్వెల్ ట్రెండ్ నడుస్తోంది. హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ తీసి సక్సెస్ అందుకుంటున్నారు హీరోలు..దర్శకులు. అందుకే ఈ మధ్య దర్శకులు సీక్వెల్ కి లీడ్ ఉండేలా క్లైమాక్స్ ప్లాన్ చేసున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ సీక్వెల్ మూవీ న్యూస్ టాక్ ఆఫ్‌ ది టౌన్ గా మారింది. అయితే ఈ సినిమాలో నటించింది ఒక హీరో అయితే...సీక్వెల్ లో నటించబోయేది మరో హీరో అని తెలుస్తుంది.

డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన సినిమా ఎం.సి.ఎ. మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమాలో నాని, సాయిపల్లవి జంటగా నటించగా...భూమిక ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. దాదాపు 25 కోట్లతో తెరకెక్కిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర 70 కోట్లు వసూళ్లు చేసింది. నాని కెరీర్ లో ఎం.సి.ఎ బెస్ట్ మూవీగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దిల్ రాజు బ్యానర్ లో వకీల్ సాబ్ తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా ఫుల్ బిజీ అయిపోతాడనుకుంటే...సీన్ రివర్స్ అయింది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పలేదు. అయితే ఈ గ్యాప్ లో వేణు శ్రీరామ్ స్టోరీస్ తయారు చేసుకుంటూ బిజీగా ఉన్నాడనే మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ తన దర్శకత్వంలో హిట్ అయిన ఎం.సి.ఎ మూవీకి సీక్వెల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీక్వెల్ కూడా ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కబోతుందని తెలిసింది. అయితే ఈ ఎం.సి.ఎ సీక్వెల్ లో నాని బదులు యంగ్ హీరో నితిన్ నటిస్తున్నాడట. దిల్ రాజు ముందుగా హీరో నానికి ఈ సీక్వెల్ మూవీ ఆఫర్ చేశాడట. అయితే ఇతర సినిమాలతో బిజిగా ఉండటం వల్ల చేయలేనని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎం.సి.ఎ సీక్వెల్ ఆఫర్ నితిన్ కి చేరింది.

ప్రస్తుతంనితిన్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మాస్ హీరోగా ట్రై చేసిన మాచర్ల నియోజకవర్గం డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న నితిన్ కొత్త కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. అలా వక్కంతం వంశీ ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకి తీసుకువెళ్లాడు నితిన్. అలాగే వెంకీ కుడుముల డైరెక్షన్ లో నితిన్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్స్ గా ఓ మూవీలో నటించనున్నారు. భీష్మ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

ఈ రెండు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టిన నితిన్...దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక దిల్ రాజు ..డైరెక్టర్ వేణుశ్రీరామ్ కి నితిన్ తో మూవీ తెరకెక్కించే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్...నితిన్ కి ఎం.సి.ఎ మూవీ సీక్వెల్ స్టోరీ చెప్పి ఎస్ అనిపించుకున్నాడట. వక్కంతం వంశీ సినిమా అయిపోయాక.. నితిన్-వేణు శ్రీరామ్ మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే మాట టి.టౌన్ లో వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ మరో వారం రోజుల్లో అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement