కొత్త జంట నిస్‌‌-చై ఫోటో వైరల్‌ | Niharika Konidela And Chaitanya Twin In White In 1st Post wedding pic | Sakshi
Sakshi News home page

వైట్‌ అండ్‌ వైట్‌ ట్విన్నింగ్‌తో నిహారిక జంట

Dec 10 2020 4:09 PM | Updated on Dec 10 2020 4:09 PM

Niharika Konidela And Chaitanya Twin In White In 1st  Post wedding pic - Sakshi

మెగా డాటర్‌, నటుడు నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ఆమె మెడలో గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడిచాడు. బంగారు వర్ణపు చీరలో నిహారిక మెరిసిపోయింది.  వివాహం అనంతరం నిహారిక- చైతన్య జంట దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైట్‌ అండ్‌ వైట్‌ దుస్తుల్లో కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్‌ కపుల్‌కి పలువురు మ్యారెజ్‌ విషెస్‌ తెలిపారు. రాజస్తాన్‌ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌లో బుధవారం రాత్రి 7:15 నిమిషాలకు కుటుంబసభ్యులు, సన్నిహితుల నడుమ వీరి పెళ్లి జరిగింది.  చిరంజీవి, పవన్‌ కల్యాణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్‌ సహా మెగా, అల్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ వివాహ మహోత్సవంలో ఆనందోత్సాహాలతో పాల్గొన్న ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి. (కాలమే నిర్ణయిస్తుంది.. నాగబాబు భావోద్వేగం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement