
సిసినీ ఇండస్ట్రీలో నటుడిగా 17 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు హీరో నాని. ‘అష్టా చమ్మా’ (2008 సెప్టెంబరు 5న రిలీజ్) చిత్రం ద్వారా నాని నటుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. స్వాతి, అవసరాల శ్రీనివాస్, భార్గవి ముఖ్య తారలుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
‘‘మీ అందరి ప్రేమతో 17 ఏళ్ళు పూర్తయ్యాయి. నేను ఇప్పుడే ప్రారంభించాను’’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాని. ఇక ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో వేసిన సెట్స్‌లో జరుగుతోంది.
ఈ చిత్రం నుంచి నాని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో 2026 మార్చి 26న విడుదల కానుంది.