జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా.. మొత్తం ఎన్ని వచ్చాయంటే? | National Awards For Tollywood Movies Full List Here | Sakshi
Sakshi News home page

National Awards For Tollywood: జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ హవా.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?

Aug 1 2025 8:06 PM | Updated on Aug 1 2025 8:06 PM

National Awards For Tollywood Movies Full List Here

తాజాగా ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. టాలీవుడ్ఇండస్ట్రీకి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ మూవీ భగవంత్ కేసరి ఎంపికైంది. తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చి హనుమాన్రెండు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలోనూ అవార్డ్సాధించింది.

తర్వాత వేణు యెల్దండి తెరకెక్కించిన రూరల్ ఎమోషనల్ చిత్రం బలగం ఉత్తమ సాహిత్యం విభాగంలో అవార్డ్ దక్కించుకుంది. సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతమందించారు. చిత్రంలోని ఊరు పల్లెటూరు అనే పాటకు లిరిక్స్అందించిన కాసర్ల శ్యామ్‌కు అవార్డు దక్కింది.

సాయి రాజేశ్డైరెక్షన్లో వచ్చిన ప్రేమకథా చిత్రం బేబీకి రెండు అవార్డులు దక్కాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సాయి రాజేశ్‌ను జాతీయ అవార్డు వరించింది. సినిమాలోని ప్రేమిస్తున్నా’ పాట పాడిన పీవీఎన్ఎస్రోహిత్కు త్తమ సింగర్అవార్డ్ దక్కింది. అలాగే సుకుమార్ కూతురు నటించిన గాంధీతాత చెట్టు చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి జాతీయ అవార్డుకు ఎంపికైంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది.

తెలుగు సినిమాలకు 7 జాతీయ అవార్డులు

  • ఉత్తమ తెలుగు చిత్రం- భగవంత్ కేసరి(అనిల్ రావిపూడి)

  • ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ- హనుమాన్

  • ఉత్తమ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌- హనుమాన్

  • ఉత్తమ స్క్రీన్‌ప్లే- బేబీ(సాయి రాజేశ్)

  • ఉత్తమ గాయకుడు- బేబీ (పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ )

  • ఉత్తమ సాహిత్యం- కాసర్ల శ్యామ్ (బలగం)

  • ఉత్తమ బాలనటి- సుకృతి వేణి బండ్రెడ్డి(గాంధీ తాత చెట్టు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement