
త్వరలోనే ఆరోగ్యం కుదుటపడుతుందని మంచాన పడ్డ అభిమానికి ధైర్యాన్ని నూరిపోసాడు బాలకృష్ణ. గతంలో తనకు కూడా నడుము విరిగిందని చెప్పుకొచ్చాడు.
నందమూరి బాలకృష్ణ.. వందకు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు అభిమానులంటే మక్కువ ఎక్కువ. వారికోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడీ హీరో. కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెన్నంటే ఉండటమే కాకుండా ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందిస్తాడు. తాజాగా అతడు ఒక అభిమానితో మాట్లాడిన ఫోన్‌కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చెట్టుపై నుంచి కింద పడి మంచాన పడ్డ అభిమానిని బాలకృష్ణ ఫోన్‌లో పరామర్శించాడు. త్వరలోనే ఆరోగ్యం కుదుటపడుతుందని అతడికి ధైర్యాన్ని నూరిపోశాడు. గతంలో తనకు కూడా నడుము విరిగిందని చెప్పుకొచ్చాడు. 1993లో ఆదిత్య 369 సినిమా చేస్తున్నప్పుడు కిందపడి నడుం విరిగిందని, కొన్నిరోజులు కష్టంగా ఉంటుంది కానీ త్వరగానే బాగవుతుందని తెలిపాడు.
అభిమాని కీ ఫోన్ చేసి దైర్యం చేప్పిన బాలయ్య#Balayya recent phone conversation with a fan 👏#NandamuriBalakrishna #GoldenHeart pic.twitter.com/pWM0dnDp4c
— manabalayya.com (@manabalayya) June 13, 2021
ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘అఖండ’పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేయనున్నాడు.