ఫ్రీగా పెళ్లి దుస్తులు కావాలన్న నటి.. ఏకిపారేసిన డిజైనర్‌ | Sakshi
Sakshi News home page

ఫ్రీగా వెడ్డింగ్‌ డ్రెస్సులు కావాలా? నువ్వో పెద్ద సెలబ్రిటీ మరి! నటిపై ఫైర్‌

Published Mon, Feb 5 2024 11:11 AM

Naagin 5 Actress Surbhi Chandna Team Asks For Free Clothes From A Designer For Her Wedding - Sakshi

నాగిన్‌ సీరియల్‌ ఫేమ్‌, బుల్లితెర నటి సురభి చందన పెళ్లికి రెడీ అవుతోంది. 13 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న నటుడు కరణ్‌ శర్మతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. మార్చి 1 లేదా 2న జైపూర్‌ వేదికగా వీరి వివాహం జరగనుందట! తాజాగా ఈ బ్యూటీ ఓ వివాదంలో చిక్కుకుంది. ఈమె తన పెళ్లి కోసం గ్రాండ్‌గా కనిపించే దుస్తులను ఫ్రీగా ఇవ్వమని అడిగిందట. ఇంకేముంది, డిజైనర్‌కు మండిపోయింది. ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోవడానికి డబ్బులుంటాయి కానీ బట్టలు కొనుక్కోవడానికి ఉండవా? అని ఆగ్రహించాడు.

నేనెందుకు ఫ్రీగా ఇస్తా?
అంతేకాదు, ఆమె టీమ్‌తో చాట్‌ చేసిన స్క్రీన్‌షాట్లను ఆయుష్‌ కేజ్రీవాల్‌ అనే డిజైనర్‌ రెడ్డిట్‌ ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేశాడు. నాకు సంబంధమే లేని వ్యక్తి పెళ్లికి నేనెందుకు ఉచితంగా దుస్తులివ్వాలి? ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. పెద్ద రాజభవనం లాంటి ప్యాలెస్‌లో పెళ్లి చేసుకోవాలనుకునేవాళ్లకు కనీసం దుస్తులు కొనడానికి కూడా డబ్బులుండవా? అని విమర్శించాడు. ఈ ఘటనపై నెటిజన్లు సురభిని తిట్టిపోస్తున్నారు.

డ్రెస్‌ కొనుక్కోవడానికి డబ్బుల్లేవా?
'ఈమె పెద్ద సెలబ్రిటీ అనుకుంటుంది. తన కోసం పెద్ద పెద్ద బ్రాండ్లు ముందుకు వచ్చి అన్నీ స్పాన్సర్‌ చేస్తారనుకుంటుంది..', 'ఎంతో ఘనంగా వెడ్డింగ్‌ చేసుకోవాలనుకున్నప్పుడు డిజైనర్‌కు కూడా ఎంతో కొంత ముట్టజెప్తే బాగుంటుంది' అని కామెంట్లు చేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం సురభిని వెనకేసుకొస్తున్నారు. ఆమెకు ఫ్రీగా డ్రెస్సులు ఇస్తే ఆ డిజైనర్‌కు గుర్తింపు వస్తుందిగా! చాలామంది డిజైనర్లు.. గుర్తింపు కోసం, బిజినెస్‌ కోసం సెలబ్రిటీలకు ఫ్రీగా దుస్తులు పంపిస్తారు. దానివల్ల వారి బిజినెస్‌కు ప్రమోషన్‌ చేసినట్లేగా అంటున్నారు. దీనిపై నటి టీమ్‌ ఏమని స్పందిస్తుందో చూడాలి!

ఇద్దరిదీ సీరియల్‌ బ్యాక్‌గ్రౌండే..
కాగా సుర‌భి హిందీ సూప‌ర్ హిట్ సీరియ‌ల్ 'తార‌క్ మెహ‌తా కా ఉల్టా చ‌ష్మా'లో అతిథి పాత్ర‌లో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియ‌ల్‌లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. 'ఇష్క్‌బాజ్‌', 'సంజీవ‌ని', 'నాగిన్ 5', 'హున‌ర్బాజ్‌:  దేశ్ కీ షాన్‌' వంటి పలు సీరియల్స్‌ చేసింది. బాబీ జాసూస్‌ చిత్రంతో వెండితెరపైనా తళుక్కుమంది. కరణ్‌ శర్మ 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'ప‌విత్ర రిష్తా' వంటి సీరియ‌ల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్ర‌స్తుతం 'ఉదారియ‌న్' అనే సీరియ‌ల్ చేస్తున్నాడు.

చదవండి: విశాల్‌ వల్లే వెనక్కు వెళ్లిపోయారు.. సినిమాను సినిమా వాళ్లే చంపేస్తున్నారు

Advertisement
 
Advertisement
 
Advertisement