ఒకేసారి 8 సినిమాలు.. దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు | Music Director S S Venkatesh Upcoming Projects Details | Sakshi
Sakshi News home page

ఒకేసారి 8 సినిమాలు.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్

Jun 2 2026 6:08 PM | Updated on Jun 2 2026 7:44 PM

Music Director S S Venkatesh Upcoming Projects Details

​సాధారణంగా ఒక సంగీత దర్శకుడి చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉంటేనే గొప్ప విషయం. కానీ, తన అద్భుతమైన టాలెంట్‌తో ఏకంగా 8 సినిమాలకు ఒకేసారి సంగీతం అందిస్తూ సినీ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి దారి తీస్తున్నారు ప్రముఖ సౌండ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. వెంకటేష్. ​గతంలో ఎన్నో చిత్రాలకు తన అద్భుతమైన సౌండ్ డిజైనింగ్‌తో ప్రాణం పోసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా తన సత్తా చాటుతున్నారు. ఒకేసారి విభిన్న జానర్స్‌లో తెరకెక్కుతున్న చిత్రాలకు ఆయన ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం విశేషం. ​ప్రస్తుతం ఆయన చేతిలో ​ది ఫైనల్ కాల్,​హనుమ,​అపరిచిత దారి,​చెట్టు మీద దెయ్యం నాకేం భయం,​నడికట్టు,​సువార్తపురం స్టూడెంట్స్(VS -1), ​స్పిరిట్,​ప్రేమ తీరం చిత్రాలు ఉన్నాయి.

​బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడమే నా లక్ష్యం 
ఈ అరుదైన లైనప్ పై సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "నాపై నమ్మకంతో ఏకకాలంలో ఇన్ని సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క దర్శక నిర్మాతకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా ప్రతి చిత్రానికీ 100% బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్ ఇస్తాను. మంచి కంటెంట్, సినిమా మీద ప్యాషన్‌తో వచ్చే ప్రతి ఫిల్మ్ మేకర్‌కు మా స్టూడియో ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుంది. వారికి అత్యుత్తమ టోటల్ ఆడియోగ్రఫీ సేవలను అందిస్తాం" అని ఆయన భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement