అమ్మ గురించి అలాంటివీ రాయొద్దు.. మీనా కూతురు ఎమోషనల్ | Sakshi
Sakshi News home page

Meena: మీనా కూతురు ఎమోషనల్ స్పీచ్‌.. కంటతడి పెట్టిన మీనా, రజినీకాంత్

Published Sat, Apr 22 2023 8:07 AM

Meena Daughter Nainika Emotional Speech About Her Mother - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన నటి మీనా. దాదాపు మూడు దశాబ్దాలుగా స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది.  కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాగార్జున వంటి అగ్ర హీరోలందరితో నటించింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప కూడా జన్మించింది. అయితే గతేడాది జూన్‌లో ఆమె భర్త మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. 

ఇదిలా ఉండగా.. మీనా ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గత నెలలో చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలు  కూడా హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఎమోషనలయ్యారు. మీనా కూతురు నైనిక మాటలకు రజినీకాంత్‌, పలువురు సినీ తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగ రిలీజ్ చేశారు. 

నైనిక మాట్లాడుతూ.. 'అమ్మా.. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్‌కు వెళ్లిపోయి చాక్లెట్స్‌ తింటూ కూర్చున్నా. ఆరోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డారో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకు నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్స్‌లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్దు.' అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో చూసిన తలైనా రజినీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సెలబ్రిటీలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకలో రజనీకాంత్‌, బోనీకపూర్‌, రాధిక, రోజా, సంఘవి, స్నేహా, జూనియర్‌ శ్రీదేవి, ప్రభుదేవా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement