
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా (Mazaka) సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైంది. అయితే, ప్రేక్షకులకు ఈ చిత్రం పెద్దగా కనెక్ట్ కాలేదు. దర్శకుడు త్రినాథరావు తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాజేశ్ దండ నిర్మించారు. రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అయితే, ఈ సినిమా చాలామంది బయ్యర్లకు నష్టాలనే మిగిల్చింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే బయ్యర్లు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్మాతలతో ఢీల్ సెట్ చేసుకుంటున్నారు. సినిమాకు భారీ నష్టాలు వస్తే కొంత నిర్మాతల నుంచి రిటర్న్ ఉండేలా ముందస్తుగా ఒప్పందం చేసుకుంటున్నారు.
మజాకా మూవీని కొనుగోలు చేసిన బయ్యర్స్‌ను నిర్మాత రాజేశ్ దండ ఆదుకున్నారంటూ ఒక వార్త సోషల్‌మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మజాకా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో నిర్మాతలు చెప్పిన ధరకు బయ్యర్స్ కొనుగోలు చేశారు. విడుదల తర్వాత కూడా సినిమా బాగుందని టాక్ వచ్చింది. కానీ, కమర్షియల్‌గా అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో బయ్యర్లు సుమారు రూ. 4 కోట్ల వరకు నష్టపోయారట. ఆ డబ్బు తిరిగివ్వాలని నిర్మాతను చాలారోజులుగా బయ్యర్తు అడుగుతూ వచ్చారట. అయితే, తాజాగా ఆ మొత్తాన్ని వారికి చెల్లించారని తెలుస్తోంది.

ప్రస్తుతం నిర్మాత రాజేశ్ దండ మరో సినిమాతో రానున్నారు. కిరణ్ అబ్బవరంతో కే రాంప్ (K-Ramp) మూవీ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ మూవీకి లైన్ క్లియర్ కావాలంటే బయ్యర్లతో ఉన్న వివాదం సెటిల్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే ఆయన వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇచ్చేశారని టాక్.