Ponniyin Selvan:వచ్చే ఏడాది వస్తాం

ప్రముఖ దర్శకులు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై సుభాస్కరన్, మణిరత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి భాగాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, ‘జయం’ రవి, త్రిష, శోభితా ధూలిపాళ్ల, ఐశ్వర్యా లక్ష్మీ నటిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
The golden era comes to life! #PonniyinSelvan #PS1 #ManiRatnam @MadrasTalkies_ pic.twitter.com/RHbwDoMv22
— Lyca Productions (@LycaProductions) July 19, 2021