స్టార్ హీరోతో మమతా మోహన్‌ దాస్.. డేటింగ్‌పై ఆసక్తికర కామెంట్స్! | Mamta Mohandas Interesting Comments On Dating With Someone, Deets Inside | Sakshi
Sakshi News home page

Mamta Mohandas On Dating: స్టార్ హీరోతో మమతా మోహన్‌ దాస్.. డేటింగ్‌పై ఆసక్తికర కామెంట్స్!

Published Wed, Jun 12 2024 5:18 PM | Last Updated on Wed, Jun 12 2024 6:09 PM

Mamta Mohandas Interesting Comments On Dating With Someone

టాలీవుడ్‌లో యమదొంగ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ మమతా మోహన్‌దాస్‌. మలయాళంతో పాటు తెలుగులోనూ నటించింది. వెంకటేశ్ సరసన చింతకాయల రవి చిత్రంలోనూ మెరిసింది. ఆ తర్వాత క్యాన్సర్‌ బారిన పడిన మమతా సినిమాలకు దూరమైంది. చాలా ఏళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడి కోలుకుంది. గతేడాది రుద్రంగి సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇ‍చ్చింది.

ప్రస్తుతం కోలీవుడ్‌లో మహారాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు ముద్దుగుమ్మ.  ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వూలో ఆమె మాట్లాడారు. తన వ్యక్తిగత జీవితంపై గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆమెను తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.

మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ.. "నాకు మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన గుర్తింపుతో చాలా సంతోషంగా ఉన్నా. తాను నటించిన చిత్రాలకు ప్రశంసలు కూడా దక్కాయి. అందువల్లే తమిళం, తెలుగు సినిమాలు చేసే అవకాశం వచ్చింది. మలయాళ ప్రేక్షకులు నాకు అండగా ఉన్నారు. బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి, గౌరీ ఖాన్‌ నాపై ప్రశంసలు కురిపించారు.' అని అన్నారు.

డేటింగ్‌ గురించి మాట్లాడుతూ..'గతంలో లాస్‌ఎంజిల్స్‌లో ఉన్నప్పుడు ఒకరితో డేటింగ్‌లో ఉన్నా. కానీ ఆ రిలేషన్‌ ఎక్కువకాలం నిలవలేదు. లైఫ్‌లో రిలేషన్‌ అనేది ఉండాలి. కానీ దానివల్ల వచ్చే ఒత్తిడిని నేను కోరుకోవడం లేదు. అయితే జీవితంలో రిలేషన్ అనేది కచ్చితంగా అవసరమని నేను అనుకోవడం లేదు. ఎవరితోనైనా డేటింగ్‌లో ఉన్నారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నా. నా లైఫ్ భవిష్యత్తులో ఎలా ఉండనుందో చూద్దాం. ప్రస్తుతం అయితే పార్ట్‌నర్‌ కోసం వెతుకుతున్నా. కాలంతో పాటే అన్ని విషయాలు ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే' అని అన్నారు. మలయాళ సినిమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. కాగా.. ప్రస్తుతం మమతా నటించిన మహారాజా చిత్రంలో అనురాగ్ కశ్యప్, నట్టి నటరాజ్ కూడా ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం జూన్ 14న థియేటర్లలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement