సూర్య భాయ్.. ఎలాగోలా ముంబయిలో బతకాలని రాలేదు.. ఈ ముంబయిని ఏలడానికి వచ్చా.. ఈ డైలాగ్ గుర్తుందా? ప్రిన్స్ ఫ్యాన్స్‌కు అయితే వెంటనే చెప్పేస్తారు. ఈ డైలాగ్ మూవీ పేరుతో పాటు క్యారెక్టర్ కూడా వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. అంతలా ఈ సినిమాలో డైలాగ్స్ గుర్తుండిపోతాయి. అదేనండి.. మన మహేశ్ బాబు నటించిన మాస్ యాక్షన్ మూవీ బిజినెస్‌మెన్. అదే సూర్యభాయ్ అంటే పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్ .. ఇలాంటి మళ్లీ వినాలనుకుంటున్నారా? అది థియేటర్లలో మరోసారి వింటే ఎలా ఉంటుంది. అందుకే మీకోసం మళ్లీ వచ్చేస్తున్నాడు సూర్య భాయ్.
మరోసారి మిమ్మల్ని అలరించేందుకు సూర్య భాయ్ వస్తున్నాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. 2012లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మాస్ యాక్షన్ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. వచ్చేనెల నవంబర్ 29న ఈ మూవీ రీ రిలీజ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను 4కె వర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
46 years of Superstar @urstrulyMahesh in Telugu Cinema will be celebrated with the re-release of #Businessman💥#Businessman4K - noveMBer 29th, 2025 🦁#BusinessmanReRelease@MsKajalAggarwal #PuriJagannadh @musicthaman #RRMakers @MangoMassMedia #TeluguFilmNagar pic.twitter.com/m0D3yel12t
— Telugu FilmNagar (@telugufilmnagar) October 30, 2025


