సుకుమార్‌-మహేష్‌ కాంబినేషన్‌లో మరో సినిమా? | Mahesh Babu and Allu Arjun Wishes To Director Sukumar | Sakshi
Sakshi News home page

లెక్కల మాస్టారికి ప్రముఖుల ​బర్త్‌డే విషెస్‌

Jan 11 2021 8:01 PM | Updated on Jan 11 2021 8:55 PM

Mahesh Babu and Allu Arjun Wishes To Director Sukumar  - Sakshi

డిఫరెంట్‌ సినిమాలతో ఎంతోమంది టాలీవుడ్‌ హీరోలకు బ్రేక్‌ ఇచ్చిన దర్శకుడు సుకుమార్‌. నేడు (జనవరి 11) ఈ లెక్కల మాస్టారి 51వ పు‍ట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెబుతున్నారు. తాను పనిచేసిన అత్యంత టాలెంటెడ్‌ డైరెక్టర్లలో ఒకరైన సుకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా వన్‌ నెనొక్కడినే సెట్‌పై ఇద్దరూ  ముచ్చటిస్తున్న ఫోటోను మహేష్‌ షేర్‌ చేశారు. కాగా ఎన్నో అంచనాల మధ్య మహేష్‌ బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నెనొక్కడినే మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రీన్ ప్లే మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.

రెండేళ్ల గ్యాప్‌ అనంతరం వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ వస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించినా అది పట్టాలెక్కలేదు. దీంతో అదే కథను సుకుమార్‌ స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌కు వినిపించారు. కొన్ని మార్పులు-చేర్పులు చేసి అదే స్టోరీని ప్రస్తుతం ‘పుష్ఫ’ గా తెరకెక్కిస్తున్నారు. మరోవైపు మహేష్‌ నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమా అనంతరం సుకుమార్‌ డైరెక్షన్‌లో ఓ చిత్రం రానున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. (‘సర్కారు వారి పాట’పై స్పందించిన రేణు దేశాయ్‌)

ఇక అల్లుఅర్జున్‌ ట్వీట్‌ చేస్తూ..''నా దర్శకుడు మరియు స్నేహితుడు అయిన సుకుమార్  ఇలాంటి సంతోషకరమైన రోజులు మరెన్నో జరుపుకోవాలి. మేము కలిసి సినిమా ప్రయాణాన్ని ప్రారంభించాము. ఆయన ఇంకా ఎన్నో మైలురాళ్ళు చేరుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ సుకుమార్'' అని పేర్కొన్నాడు. సుకుమార్ - బన్నీ కలిసి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్య-2 తెరకెక్కించారు. ఇప్పుడు  హ్యాట్రిక్ మూవీగా 'పుష్ప: అనే పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం మారేడుమిల్లి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. ‌ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ కుటుంబసభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. (‘ఆచార్య’కి నో.. అల్లు అర్జున్‌ చెల్లిగా ఓకే )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement