కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప | Maganti Roopa Comments On Her Daughter's Marriage With Keeravani Son Sri Simha | Sakshi
Sakshi News home page

కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప

Apr 6 2024 8:57 AM | Updated on Apr 6 2024 10:39 AM

Maganti Roopa Comments On Her Daughter's Marriage With Keeravani Son Sri Simha - Sakshi

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలు వియ్యం అందుకోనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆస్కార్‌ గ్రహీత ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో.. నటుడు మురళీ మోహన్‌ మనుమరాలి పెళ్లి జరగనున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత అవన్నీ నిజమేనని మురళీ మోహన్‌ కూడా ప్రకటించారు.

తాజాగా ఆ పెళ్లి వేడుక విషయంపై మురళీ మోహన్‌ కోడలు మాగంటి రూప కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎమ్‌ఎమ్‌ కీరవాణి తనయుడు, హీరో శ్రీ సింహతో తన కూతురు 'రాగ' పెళ్లి ఫిక్స్‌ అయినట్లు ఆమె పేర్కొన్నారు. మురళీ మోహన్‌ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే 50 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా ఆయనతో పాటుగా కోడలు రూప కూడా ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి జరగుతుందని ఆమె ప్రకటించారు.

మురళీ మోహన్‌కు  ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కూతురు  విదేశాల్లో సెటిలైంది. కుమారుడు రామ్‌ మోహన్‌ మాత్రం ఆయనకు సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. రామ్‌ మోహన్‌- రూపల కుమార్తెనే 'రాగ'. విదేశాల్లో ఆమె బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలే చూసుకుంటుంన్నారట.

ఇక శ్రీసింహ విషయానికి వస్తే యమదొంగ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించాడు. మత్తు వదలరా సినిమాతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడంతో బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement