లెజెండ్‌ మళ్లీ వచ్చేస్తున్నాడు.. కాస్తా లేటయింది అంతే! | Sakshi
Sakshi News home page

Legend Saravanan: కాస్తా ఆలస్యమైంది.. త్వరలోనే షూటింగ్ : శరవణన్

Published Wed, Aug 16 2023 8:40 AM

Legend Saravanan Announced New Movie Will Begin Shortly - Sakshi

లెజెండ్ శరవణన్ ఈ పేరు చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒకే ఒ‍క్క సినిమాతో ఎంట్రీ అందరినీ ఆకట్టుకున్నారు. వ్యాపారవేత్త అయినప్పటికీ నటనపై మక్కువతో లెజెండ్ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కానీ శరవణన్‌కు మాత్రం ఓ రేంజ్‌ గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత కాస్తా సైలెంట్ అయిన ఆయన.. మళ్లీ వార్తల్లో నిలిచాడు. మరో చిత్రం చేసేందుకు రెడీ అయిపోయారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: సలార్‌తో సై అంటున్న వివేక్ అగ్నిహోత్రి.. బాక్సాఫీస్‌ బరిలో నిలుస్తాడా?)

ఆగస్టు 15న 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లెజెండ్‌ శరవణన్ తమిళనాడులోని ఓ పాఠశాలలో ప్రత్యక్షమయ్యారు. పిల్లలతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్న శరవణన్‌.. వారందరికీ గిఫ్ట్స్ అందజేశారు. అంతేకాకుండా పిల్లలతో కలిసి జైలర్‌ చిత్రంలోని  పాటకు డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 

అంతేకాకుండా ఆయన ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. కాగా మీరు మళ్లీ ఎప్పుడు చిత్రంలో నటిస్తారు? అని పిల్లలు అడగడంతో.. త్వరలోనే కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.  కథ రెడీ కావడానికి కాస్తా టైం పట్టిందని లెజెండ్ శరవణన్ ప్రకటించారు. చిన్న పిల్లల మధ్య ఈ విషయాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం లెజెండ్‌ శరవణన్‌ తాజా చిత్రంపై సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.

(ఇది చదవండి: జవాన్ ప్రమోషన్లలో కనిపించని నయనతార.. అసలేమైంది?)

Advertisement
 
Advertisement