సంక్రాంతి నుంచి తప్పుకున్న 'లాల్‌ సలాం'.. కారణం ఇదేనా? | Superstar Rajinikanth Lal Salaam Movie Exit From The Sankranthi 2024 Festival Release Race - Sakshi
Sakshi News home page

సంక్రాంతి నుంచి తప్పుకున్న రజనీకాంత్‌ 'లాల్‌ సలాం'

Published Thu, Dec 21 2023 1:40 PM

Lal Salaam Movie Not Release In Sankranthi - Sakshi

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్‌ సలాం’. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' 2024 సంక్రాంతి బరిలో ఉంటుందని ఇప్పటికే మేకర్స్‌ తెలిపారు. కానీ సమయం దగ్గర పడుతున్నా లాల్‌ సలాం సినిమాపై పెద్దగా బజ్‌ క్రియేట్‌ కాలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్‌ ఇందులో అతిథి పాత్రలో కనిపించడమే అని చెప్పవచ్చు. తాజాగా సంక్రాంతి రేసు నుంచి లాల్‌ సలాం చిత్రాన్ని తప్పిస్తున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

ఈ సంక్రాంతికి చాలా వరకు భారీ సినిమాలు ఉన్నాయి. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్', శివ కార్తికేయన్ 'అయలాన్'  చిత్రాలు కోలీవుడ్‌లో రెడీగా ఉన్నాయి. అంతే కాకుండా జైలర్‌ సినిమాతో తెలుగులో కూడా రజనీ మార్కెట్‌ భారీగానే పెరిగింది. ఈ సంక్రాంతికి టాలీవుడ్‌ నుంచి  గుంటూరు కారం, ఈగల్‌, నా సామిరంగా,సైంధవ్‌, హనుమాన్‌ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. దీంతో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకే థియేటర్లు సరిపోవని పరిస్థితి టాలీవుడ్‌లో ఉంది. ఇలాంటి టైమ్‌లో మరో మూడు తమిళ సినిమాలు అంటే థియెటర్ల కొరత ఏర్పడటం జరుగుతుందని లాల్‌ సలాం టీమ్‌ ఆలోచిస్తుందట.

దీంతో లాల్‌ సలాం వెనక్కు తగ్గడమే మేలని వారు భావించారట. భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో తేడా వస్తే బిజినెస్‌పై ప్రభావం పడుతుందని భావించిన మేకర్స్‌  ఫైనల్‌గా పొంగల్‌ నుంచి డ్రాప్ కావడమే బెటర్‌ అని నిర్ణయించుకున్నారట. కొద్దిరోజుల పాటు లాల్‌ సలాం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ కార్యక్రమాలకు కూడా తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.

విక్రమ్ తంగలాన్ సినిమా కూడా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.  జనవరి 26 విడుదల చేస్తామని చెప్పిన తంగలాన్‌ మేకర్స్‌ మరోసారి వాయిదా వేశారు. కాబట్టి 2024 జనవరి 26న లాల్‌ సలాం వచ్చే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement