నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా | Kumbh Mela Monalisa Comments On Film Director Sanoj Mishra | Sakshi
Sakshi News home page

నన్ను తాకేవాడు.. ఇంట్లో వాళ్లకు చెబితే సర్దుకుపొమ్మన్నారు: మోనాలిసా

Mar 25 2026 10:43 AM | Updated on Mar 25 2026 10:49 AM

Kumbh Mela Monalisa Comments On Film Director Sanoj Mishra

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాతో పాపులర్‌ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది.  తనకు మొదటిసారిగా సినిమా ఛాన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించిన బాలీవుడ్‌ దర్శకుడు సనోజ్‌ మిశ్రాపై మీడియాతో మాట్లాడుతూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

షూటింగ్ సెట్‌లో సనోజ్ మిశ్రా తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించారని మోనాలిసా వాపోయింది. షూటింగ్‌ పేరుతో​ తన శరీరాన్ని పలుమార్లు తాకుతూ చాలా ఇబ్బందిపెట్టేవాడిని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పినా పట్టించుకోలేదని పేర్కొంది. తన ఇంట్లో వారితో కన్నీళ్లు పెట్టుకున్నా సరే  మొదటి సినిమా కావడంతో సర్దుకుపోవాలని సూచించారని మోనాలిసా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, ఆ సమయంలో తన వయసు 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదని గుర్తుచేసింది. అందుకే బయటి ప్రపంచానికి చెప్పలేకపోయానని తెలిపింది. ప్రస్తుతం తన భర్త ఫర్మాన్‌ ఖాన్‌తో కలిసి కేరళలో నివసిస్తున్నానని చెప్పింది. తమకు ప్రాణహాని ఉండటంతో ఆందోళనతో ఉన్నామని తెలిపింది.

యూపీ ఝాన్సీ నగరానికి చెందిన ఓ యువతి కూడా గతంలో సనోజ్‌ మిశ్రాపై లైంగిక ఆరోపణలు చేసింది.  సినిమా ఛాన్స్‌ ఇస్తానని నమ్మించి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. జూన్‌ 18, 2021న తనని ఓ రిసార్ట్‌లో తనకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. అయితే, ఆ సమయంలో వీడియోలు కూడా రికార్డ్‌ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ వీడియోలతో  బెదిరించి చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆ యువతి పేర్కొంది. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలసిందే. తర్వాత బెయిల్‌ ద్వారా విడుదలయ్యారు. అయితే, మోనాలిసా పెళ్లి చేసుకున్న తర్వాత సనోజ్‌ మిశ్రా సంచలన కామెంట్‌ చేశాడు. మోనాలిసా సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ఆమె సడెన్‌గా పెళ్లి చేసుకోవడంతో సినిమా ఫలితంపై భారీ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement