Krithi Shetty To Play The Leading Lady Opposite Vishal - Sakshi
Sakshi News home page

Krithi Shetty: విశాల్‌తో కృతీశెట్టి రొమాన్స్‌!

Jun 1 2023 8:41 AM | Updated on Jun 1 2023 1:53 PM

Krithi Shetty To Play The Leading Lady Opposite Vishal - Sakshi

ప్రస్తుతం లక్‌ అంటే నటి కృతిశెట్టిదే. ఈ 19 ఏళ్ల కన్నడ బ్యూటీ ఇప్పటికీ నటించింది ఆరేడు చిత్రాలే. అందులో తెలుగులో విజయం సాధించిన చిత్రాలు సగం కూడా లేవు. ఇక తమిళంలో ఎంట్రీ ఇచ్చిన రెండు చిత్రాలు (ది వారియర్‌, కస్టడీ) నిరాశపరిచాయి. లక్కీగా బాలా దర్శకత్వంలో నటించాల్సిన చిత్రం నుంచి బయటపడింది. కాగా కృతిశెట్టికి అవకాశాలు మాత్రం ఈ రెండు భాషల్లోనూ వెతుక్కుంటూ రావడం విశేషం.

ముఖ్యంగా తమిళంలో స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ నటుడు సూర్యతో నటించే అవకాశం మిస్‌ అయిన త్వరలో ఆయన సోదరుడు కార్తీతో జతకట్టే అవకాశం వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో విజయ్‌ సరసన నటించే లక్కీ చాన్స్‌ ఈమెకు వరించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.

కాగా తాజాగా నటుడు విశాల్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం ఈ అమ్మడి తలుపు తట్టినట్లు తెలిసింది. ఇంతకుముందు ప్రశాంత్‌ దర్శకుడు పాండిరాజ కాంబినేషన్లో రూపొందిన కథాకళి చిత్రం 2016లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా సుమారు ఏడాది తరువాత ఈ కాంబో రిపీట్‌ కాబోతోంది. ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెలలో తిరుచ్చిలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఇందులో విశాల్‌కు జంటగా నటి కృతిశెట్టి నటింప చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement