
‘‘సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుందనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల రెండో వారంలో సినిమాను విడుదల చేస్తాం’’..
‘రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ఇటీవల విడుదలైన ‘రౌడీ బాయ్స్’లో కీలక పాత్రల్లో నటించారు లగడపాటి శిరీషా శ్రీధర్ తనయుడు విక్రమ్. తాజాగా ‘వర్జిన్ స్టోరి’ చిత్రంతో విక్రమ్ హీరోగా పరిచయం కానున్నారు. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ ఉపశీర్షిక. లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ బి. అట్లూరి దర్శకుడు.
ఈ సినిమా నుంచి 'కొత్తగా రెక్కలొచ్చెనా..' అంటూ సాగే మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుందనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల రెండో వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని లగడపాటి శిరీషా శ్రీధర్ అన్నారు. సౌమిక పాండియన్, రిషికా ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాఘవేంద్ర.