
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కలయికలో మొదలైన సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా కోలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్ పైకి కూడా వస్తాడనేది నెట్టింట వైరల్ అవుతుంది.
‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లోకి తమిళ స్టార్ హీరో విక్రమ్ జాయిన్ కాబోతున్నాడని సమాచారం. ఈమేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయట. గతంలో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంట్రీ గురించి మొదట రూమర్స్‌తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మే నుంచి జూన్ వరకు ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో బిగ్ యాక్షన్ ఎపిసోడ్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సీన్ నుంచే విక్రమ్ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

‘ఎస్‌ఎస్‌ఎంబీ29’లో విక్రమ్ నటించబోతున్నట్లు గతేడాదిలోనే ఈ రూమర్స్ వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమ్ ఇలా స్పందించాడు. 'రాజమౌళి, నేను రెగ్యూలర్‌గానే టచ్‌లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ, మహేష్ మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు జరగలేదు' అని ఆయన తెలిపారు. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా తనపై రూమర్స్ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్ అయ్యాడు. కొంత కాలానికి మహేష్ సినిమాలో తాను భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే జరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.