
తమిళనాడు జరిగిన విషాదంపై డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ తీవ్రస్థాయిలో స్పందించింది. కరూర్‌లో జరిగిన దుర్ఘటనలో అత్యంత సన్నిహితులైన వారిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేసింది. దీనంతటికీ కారణం టీవీకే స్వార్థ రాజకీయాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్.. మీ స్టార్‌డమ్ కోసం ప్రజలు ఎందుకు బలవ్వాలని ప్రశ్నించింది. మీ ఆకలికి ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నారని నిలదీసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ట్వీట్ చేసింది. కాగా.. నిన్న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ విషాదంపై పలువురు సినీతారలు స్పందించారు. రజీనీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్.. ఈ ఘటనతో తన గుండె పగిలిందని ట్వీట్ చేశారు. వారిని ఓదార్చేందుకు కూడా మాటలు రావడం లేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున రూ.20 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
My deepest condolences to the families of those who lost their lives 💔
Lost one of my closest friends in the Karur rally. All for TVK’s selfish politics. Vijay, people are not props for your stardom. How many more lives for your hunger? #Karur #Stampede #TVKvijay pic.twitter.com/jW3qlxvPbO— Kayadu Lohar (@Kayadu__Lohar) September 27, 2025