
హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారారు. సుమైరా స్టూడియోస్‌తో కలిసి తన నిర్మాణ సంస్థ కేఏప్రోడక్షన్స్ పతాకంపై విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘తిమ్మరాజుపల్లి టీవీ’ అనే ఓ పీరియాడికల్ సినిమాను కిరణ్ అబ్బవరం నిర్మించనున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన గత సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా చేసిన సాయితేజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తారు.
అలాగే కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసిన వి. మునిరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్‌గా, ప్రదీప్ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధానపాత్రల్లో కనిపిస్తారు. ‘‘ఈ ఏడాది చివర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు.