కొత్త పాత్ర

Keerthy suresh turns producer for web series - Sakshi

నటిగా కీర్తీ సురేశ్‌ ఫుల్‌ బిజీ. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. అయితే మరో కొత్త పాత్రలోకి వెళ్లనున్నారని టాక్‌. కీర్తీ సురేశ్‌ నిర్మాతగా మారాలనుకుంటున్నారట. దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. ఓ తమిళ వెబ్‌ సిరీస్‌ కథ కీర్తీని బాగా ఆకట్టుకుందట. ఆ కథను ప్రేక్షకులకు చెప్పాలని సిరీస్‌ను నిర్మించాలని ఫిక్సయ్యారట. నటిగా అద్భుతమైన కథలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లి శభాష్‌ అనిపించుకున్నారు కీర్తి. నిర్మాతగా కూడా అలాంటి కథలే చూపిస్తారని ఊహించవచ్చు. మరో విషయం ఏంటంటే కీర్తీ సురేశ్‌ తండ్రి సురేశ్‌ కుమార్‌ మలయాళంలో పాపులర్‌ ప్రొడ్యూసర్‌. మరి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటారా? చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top