
కీర్తీ సురేశ్
హీరోయిన్ కీర్తీ సురేశ్ కొత్త కబురు చెప్పారు. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా ప్రకటన వచ్చింది. ‘రఘ్‌తథా’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీకి సుమన్ కుమార్ దర్శకుడు. హిట్ వెబ్‌సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్’కు రైటర్‌గా వర్క్ చేశారు సుమన్. ‘కేజీఎఫ్, కాంతార’ వంటి హిట్స్ అందించిన కన్నడ హోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మించనుంది.
ఈ నిర్మాణ సంస్థకు తమిళంలో ఇదే తొలి మూవీ. ఓ గ్రామం, అక్కడి ప్రజల కోసం ఓ యువతి చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట.