Kartik Aaryan Rejected RS 9 Crore Offer For Pan Masala Ad - Sakshi
Sakshi News home page

Kartik Aaryan: రూ.9 కోట్ల భారీ ఆఫర్‌.. అయినా ఆ యాడ్‌కు నో చెప్పిన హీరో

Aug 30 2022 8:50 PM | Updated on Aug 30 2022 9:05 PM

Kartik Aaryan Rejected RS 9 Crore Offer For Pan Masala Add - Sakshi

పలు వ్యాపార కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం స్టార్‌ హీరోలను బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా నియమించుకుంటాయనే విషయం తెలిసిందే. ఇందుకుగాను భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ చెల్లిస్తాయి. అందుకే స్టార్‌ హీరో ఒకవైపు సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూనే..మరోవైపు యాడ్స్‌లో నటిస్తుంటారు. కొందరు హీరోలు పారితోషికాన్ని బట్టి బ్రాండ్స్‌ ప్రమోషన్‌కి ఓకే చెబితే.. మరికొందరు మాత్రం డబ్బుని పట్టించుకోకుండా.. ప్రజలకు ఇబ్బందిలేని ఉత్పత్తులకు మాత్రమే బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా ఉంటారు. ఆ లిస్ట్‌లో సాయి పల్లవి, అల్లు అర్జున్‌ లాంటి స్టార్స్‌ ఉంటారు.

(చదవండి: ఎంత పెద్ద సినిమా అయినా.. ఆ రోజు షూటింగ్‌ బంద్‌: అక్షయ్‌ కండీషన్‌)

కోట్ల రూపాయల ఆఫర్‌ వచ్చిన పొగాకు కంపెనీ ప్రకటనకి నో చెప్పాడు అల్లు అర్జున్‌. సాయి పల్లవి కూడా అంతే. ఫెయిర్ నెస్ క్రీమ్ ప్రమోట్ చేయాలని భారీ మొత్తంలో ఆఫర్ వచ్చినా..  అభిమానులను మోసం చేయడం ఇష్టం లేక రిజక్ట్‌ చేసిందట. తాజాగా అదే బాటలో నడిచాడు బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌. పాన్‌ మసాల యాడ్‌ కోసం తన వద్దకు వచ్చిన  రూ.9 కోట్ల రెమ్యునరేషన్‌ డీల్‌ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాడట. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించే ఉత్పత్తులను తాను ప్రమోషన్‌ చేయలేనని చెప్పేశాడట. గతంలో  అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారూఖ్ ఖాన్ లు పొగాకు సంస్థ ప్రకటనల్లో నటించి, నెటిజన్స​ ఆగ్రహానికి గురయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement