హీరోను ఒక్కసారి చూసేందుకు.. 1000 కి.మీ. సైకిల్‌ తొక్కుతూ.. | Kartik Aaryan Meets His Die-Hard Fan Who Cycled 1000 Km For Over 9 Days To Meet Him, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kartik Aaryan Viral Video: తొమ్మిది రోజులుగా సైకిల్‌ తొక్కుతూ.. ఎట్టకేలకు హీరోను కలిసిన అభిమాని

Published Sun, Feb 11 2024 1:06 PM | Last Updated on Sun, Feb 11 2024 2:17 PM

Kartik Aaryan Meets Fan Who Cycled 1000 km For Over 9 Days to Meet Him - Sakshi

సెలబ్రిటీలంటే పడి చచ్చేవాళ్లు బోలెడంత మంది! వారి సినిమాలు రిలీజవుతున్నా, రీరిలీజ్‌ అవుతున్నా థియేటర్ల వద్ద తెగ హంగామా చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో చేసి హడావుడి అంతాఇంతా కాదు. ఇక ఆ తారలను ఒక్కసారైనా చూడాలని, సెల్ఫీ దిగాలని తహతహలాడిపోయే ఫ్యాన్స్‌ కూడా ఉన్నారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచిందో తాజా ఘటన. బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే! చాలాచోట్ల ఇతడికి అభిమానులున్నారు.

తొమ్మిది రోజులుగా..
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఈ హీరోను చూడటం కోసం తన స్వస్థలం నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ ముంబైకి వచ్చాడు. ఇందుకోసం అతడికి దాదాపు తొమ్మిది రోజులు పట్టినట్లు తెలుస్తోంది. తన ఇంటి బయట ఉన్న ఈ అభిమానిని చూసిన కార్తీక్‌ అతడికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వబోయాడు. కానీ ఆ ఫ్యాన్‌ మాత్రం హీరో పాదాలకు నమస్కరించాడు. దీంతో అతడిని అలా చేయొద్దని వారించి తనతో కలిసి ఫోటో దిగాడు.

వీడియో వైరల్‌
అంత దూరం నుంచి సైకిల్‌పై ఎలా వచ్చావని అడిగాడు. అందుకా అభిమాని.. కేవలం మిమ్మల్ని కలుసుకోవడానికే ఊరి నుంచి వెయ్యికి పైగా కిలోమీటర్లు ఈ సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చేశాను అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కార్తీక్‌ ప్రస్తుతం చందు చాంపియన్‌ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యే ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్‌ 14న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement