
కన్నడలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై సూపర్ హిట్గా నిలిచిన హిలారియస్ కామెడీ ఎంటర్టైనర్ సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం). కేవలం నాలుగు కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. శాండల్వుడ్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు. ఈ హారర్ కామెడీ మూవీ ఆగస్టు 8న థియేటర్లలో సందడి చేసింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ నెల ఐదో తేదీ నుంచి జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి జేపీ తుమినాద్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని లైటర్ బుద్ధ ఫిల్మ్స్ బ్యానర్‌పై శశిధర్ శెట్టి బరోడా, రాజ్ బీ శెట్టి, రవి రాయ్ కలస నిర్మించారు. ఇంకేందుకు ఆలస్యం థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో ఎంజాయ్ చేయండి.
సు ఫ్రమ్ సో కథేంటంటే?
కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.