Intinti Gruhalakshmi: తులసి మీద నందు, లాస్య ప్రతీకారం!

Intinti Gruhalakshmi May 25: Nandu, Lasya Wants To Revenge On Tulasi - Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 328వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో నందు ఫ్యామిలీ చిన్నాభిన్నమైంది. లాస్య కోసం నందు ఇల్లు వదిలేసి వెళ్లిపోవడంతో తులసి అయోమయంలో పడిపోయింది. దివ్య కూడా తన తండ్రి మళ్లీ ఇంటికి వస్తాడా? లేదా? అని కంగారుపడుతోంది. మరి వీరి సమస్యలకు పరిష్కారం దొరికేనా? లేదా ఈ సమస్యలు ఇంకా పెద్దవిగా మారనున్నాయా? అసలు నేటి(మే 25వ) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..

అంకిత తనను బయటకు తీసుకెళ్లమని మారాం చేస్తే అభి ఒప్పుకోలేదు. తనకు ఓపిక లేదని, రోజంతా పని చేసొచ్చి అలిపోయినందున బయటకు తీసుకెళ్లలేనని చెప్పాడు. దీంతో తన కోరిక కూడా తీర్చడం చేతకాదంటూ అంకిత గొడవ మొదలు పెట్టింది. 'నీ తల్లి కోసం రోజంతా గొడ్డులా కష్టపడాలి, వచ్చాక కూతురిని షికారుకు తీసుకెళ్లాలి' అని అభి అసహనం వ్యక్తం చేశాడు. అలా వీళ్లిద్దరి మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది. ఇక ఎలాగో బయటకెళ్లి అక్కడే భోజనం చేస్తామని అనుకున్న అంకిత రాత్రికి ఏమీ వండిపెట్టలేదు. అసలే ఆకలితో ఉన్న అభి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చోగానే అక్కడంతా ఖాళీ గిన్నెలే దర్శనమిచ్చాయి. ఎందుకు వంట సిద్ధం చేయలేదని నిలదీస్తే.. బయటకు వెళ్దాం అనుకుంటే వద్దన్నావ్‌, అందుకే వండలేదు, ఈ ఒక్కపూటకు నీళ్లు తాగి అడ్జస్ట్‌ అయిపో అని భార్య దురుసుగా బదులిచ్చింది. దీంతో అభికి తన తల్లి తులసి గుర్తొచ్చింది. తనకు గోరుముద్దలు తినిపించే తల్లికి అనవసరంగా దూరమయ్యానే అని అమ్మను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు.

మరోవైపు తమను ఇంట్లో నుంచి వెళ్లగొట్టినందుకు నందు, లాస్య ఆవేశంతో అట్టుడికిపోయారు. జీవితంలో మర్చిపోలేని అవమానం చేసిన లాస్య మీద ప్రతీకారం తీర్చుకుంటానని మనసులోనే ప్రతిజ్ఞ చేసింది లాస్య. అటు నందు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇన్నాళ్లూ తన వెనకే ఉంటూ గోతులు తీసిందని మండిపడ్డాడు నందు. తన కూతురు ముందు కూడా తల దించుకునేలా చేసిందని ఆక్రోశించాడు.

ఇదే అదును అని భావించిన లాస్య మరో ప్లాన్‌కు తెరదీసింది. మనం అనుక్షణం సంతోషంగా ఉంటూ తులసి కుమిలిపోయేలా చేయాలని, అందులో భాగంగా అదే ఇంటి ముందు మరో ఇల్లును అద్దెకు తీసుకుని దిగుదామని సలహా ఇచ్చింది. అన్నట్లుగానే రేపటి ఎపిసోడ్‌లో నందు నివాసం ముందే మరో ఇల్లు అద్దెకు తీసుకుని దిగుతున్నారు. అంతేకాదు, ఆ ఇంట్లో నుంచి ఒక్కొక్కరినీ తులసికి దూరం చేసి ఆమెను ఏకాకిగా మారుస్తానని సవాలు విసిరింది లాస్య. మరి ఆమె ఎత్తులను తులసి ఎలా చిత్తు చేస్తుందో చూడాలి..

చదవండి: Hari Teja: కరోనాతో పోరాడుతూ... బిడ్డను కన్నాను!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top