ఇండియా తొలి సూపర్‌ గర్ల్‌గా 'ఇంద్రాణి'.. మేకింగ్ వీడియో రిలీజ్‌ | Indrani First Telugu Super Girl Movie Making Video Released | Sakshi
Sakshi News home page

Indrani Movie: ఇండియా తొలి సూపర్‌ గర్ల్‌గా 'ఇంద్రాణి'.. మేకింగ్ వీడియో రిలీజ్‌

Apr 22 2022 5:39 PM | Updated on Apr 22 2022 5:42 PM

Indrani First Telugu Super Girl Movie Making Video Released - Sakshi

యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల డెడికేషన్‌, రిస్క్‌ చూసి ఆశ్చర్యపోయానని డైరెక్టర్‌ స్టీఫెన్‌ తెలిపారు. ఇండియాలోనే మొట్టమొదటి సూపర్‌ గర్ల్‌ మూవీ 'ఇంద్రాణి' షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Indrani First Telugu Super Girl Movie Making Video Released: యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల డెడికేషన్‌, రిస్క్‌ చూసి ఆశ్చర్యపోయానని డైరెక్టర్‌ స్టీఫెన్‌ తెలిపారు. ఇండియాలోనే మొట్టమొదటి సూపర్‌ గర్ల్‌ మూవీ 'ఇంద్రాణి' షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భారీ వీఎఫ్‌ఎక్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో స్టీఫెన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యానియా భరద్వాజ్‌, కబీర్‌ దుహాన్ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు స్టాన్లీ సుమన్‌ బాబు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న వరల్డ్‌వైడ్‌గా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను రిలీజ్ చేశారు. రెండేళ్లకుపైగా జరిపిన ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌, యాక్షన్‌ కొరియోగ్రఫీ, ప్రీ-విజువలైజేషన్‌తో వీఎఫ్‌ఎక్స్‌ ప్లానింగ్‌ ఈ సినిమాను మరింత వేగంగా చిత్రీకరించేలా ఉపయోగపడుతున్నాయని డైరెక్టర్‌ తెలిపారు. భారతీయ చరిత్రలోనే మహిళలు ఇంత పెద్ద స్థాయిలో రోప్ షాట్స్, కత్తులు ఉపయోగించి విన్యాసాలు చేసిన తొలి చిత్రం 'ఇంద్రాణి' అని పేర్కొన్నారు. ఈ మూవీ మొదటి మహిళా యాంటీ గ్రావిటీ, జీరో గ్రావిటీ సినిమా అని మేకర్స్‌ వెల్లడించారు. 

చదవండి: ఆగని 'ఆర్ఆర్ఆర్‌' కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే ?


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement