అమ్మాయిలందరూ అందంగానే ఉంటారు: షారుఖ్

Highlights From Shah Rukh Khan AskSRK Session On Social Media - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌  సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లుపైనే అయిపోయింది. మరి.. షారుక్‌ తన అభిమానులకు ఏం చెబుతున్నారు? సల్మాన్‌ ఖాన్‌ గురించి ఈ హీరో ఏమన్నారు? తన జీవితం గురించి ఏం చెప్పారు? సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు విసిరిన ప్రశ్నల బాణాలకు షారుక్‌ వ్యంగ్యంగా, ప్రేమగా, సరదాగా సమాధానాలు ఇచ్చారు. అవేంటో సరదాగా చదివేయండి.

►ఒక తండ్రిగా మీరు మీ పిల్లలతో ఎంత కఠినంగా ఉంటారు?
పిల్లలు కొన్ని తప్పులు చేసినప్పటికీ వారితో ప్రేమగానే ఉండాలి. తరచూ మందలించడం, వారి పట్ల కఠినంగా ఉండటం కరెక్ట్‌ కాదు. ప్రేమకు ప్రతిరూపం వారు. నేను నా పిల్లలతో కఠినంగా ఉండటం చాలా చాలా అరుదు.

►అమ్మాయిలను ఆకర్షించాలంటే ఏం చేయాలి?
ముందు ఆకర్షణ అనే పదాన్ని మీరు మీ ఆలోచనల్లో నుంచి తీసివేయండి. వారితో హుందాగా ప్రవర్తిస్తే, గౌరవిస్తే వారికి మీ పట్ల మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది. మీ ప్రయత్నం సఫలం కావొచ్చు.

►మిమ్మల్ని కలిసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నాం?
ఆ క్షణాల కోసం నేనూ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నాను. కానీ ప్రస్తుతం నేను బయటకు వస్తే చాలామంది గంపులుగా నా కోసం వస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు (కరోనాను ఉద్దేశించి) బాగాలేవు. మనందరం కలుసుకునే తరుణం దగ్గర్లోనే ఉందని నమ్ముతున్నాను.

►కొందరు టీనేజ్‌ అమ్మాయిలు తాము అందంగా లేమని బాధపడుతుంటారు. వారికి మీరిచ్చే సలహా?
అమ్మాయిలందరూ అందంగానే ఉంటారు. అయితే ఎవరి అందం వారిది. పోలికలు పెట్టుకోకూడదు. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరెప్పుడూ ఎవరితోనూ పోల్చలేని ప్రత్యేకమైనవారే.

►మీరు సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించి దాదాపు మూడేళ్లు అవుతోంది?
నిజంగానా? సహనం కూడా భరించలేని గ్యాప్‌ అది (నవ్వుతూ). త్వరత్వరగా షూటింగ్‌ చేసేద్దాం.

►మీరు ఒక పెద్ద స్టార్‌? సాధారణ జీవితం గడపాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
నాది కూడా సాధారణ జీవితమే. ఆ మాటకొస్తే మనందరివీ సాధారణ జీవితాలే. కాకపోతే ఎవరి దారుల్లో వారిది వారికి సాధారణ జీవితం.. అంతే తేడా.

►ప్రస్తుతం నా వయసు 23ఏళ్లు. నా కెరీర్‌ గురించి నాకు భయంగా ఉంది?
వయసు అనేది కేవలం ఒక నంబర్‌ మాత్రమే. కష్టపడి పని చేయి. నువ్వు అనుకున్నది సాధిస్తావు. నేను 26 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. సమయాన్ని వృథా చేసుకోకు.

►నా జీవితం నాకు చాలా విసుగ్గా అనిపిస్తుంది. మీ మాటలతో స్ఫూర్తిని ఇవ్వండి?
ముందు సమయాన్ని ప్రయోజనకరంగా సద్వినియోగం చేసుకోవాలని గుర్తుపెట్టుకో. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, వారితో సరదాగా ఆటలు (బోర్డ్‌ గేమ్స్‌) ఆడటం వంటివాటితో నీ బోరింగ్‌ డేస్‌ను అధిగమించవచ్చు. ఓసారి ప్రయత్నించు. 

►ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌)లో మీ కేకేఆర్‌(కోల్‌కతా నైట్‌ రైడర్స్‌) టీమ్‌ ఈ సీజన్‌ టైటిల్‌ గెలవాలి లేదా మీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద 600 కోట్ల కలెక్షన్స్‌ను సాధించాలి? ఏదో ఒకటి కోరుకోండి.
మల్టీఫుల్‌ క్వొశ్చన్స్‌ను ఆన్సర్‌ చేయడంలో నాకు అంత ప్రావీణ్యత లేదు. కానీ అన్ని సమాధానాలు నిజం కావాలని కోరుకుంటాను.

►మీ లేటెస్ట్‌ సినిమాకు చెందిన వీడియోను ఎప్పుడు రిలీజ్‌ చేయబోతున్నారు?
మనమే కాదు.. చాలామంది తమ సినిమాలకు సంబంధించిన వీడియోలను రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు. తప్పకుండా మన వంతు వస్తుంది. అప్పుడు రిలీజ్‌ చేస్తాను. 

►మీకు స్నేహితులు లేరని మీరు ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పటికీ మీరు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారా?
లేదు. ఇప్పుడు నాకు స్నేహితులు ఉన్నారు. నా పిల్లలే నా స్నేహితులు.

►నేను చదువుకోవాలా? లేక మీకు సోషల్ మీడియాలో టెక్ట్స్‌ చేయాలా?
చదువుకో...

►మీరు ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటి?
నేను తక్కువగా తింటాను.

►ఆమిర్‌ఖాన్‌ నటించిన చిత్రాల్లో మీ ఫేవరెట్‌ మూవీస్‌?
రాక్, ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌ , దంగల్, త్రీ ఇడియట్స్, లగాన్‌

►సల్మాన్‌ భాయ్‌ గురించి?
భాయ్‌ ఎప్పటికీ భాయే.

►మీకు చాలా ఈగో ఉందట కదా!
లేదు. నేను చాలా గొప్పవాడిని. నాకు ఈగో లేదు (నవ్వుతూ). 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top