Venkatesh Daggubati Birthday: Happy Birthday wishes For Victory Venkatesh On Social Media - Sakshi
Sakshi News home page

Happy Birthday విక్టరీ వెంకటేష్‌: చిరు స్పెషల్‌ విషెస్‌

Dec 13 2021 2:27 PM | Updated on Dec 13 2021 3:41 PM

Happy Birthday wishes Victory Venkatesh on Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ వెర్సటైల్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ పుట్టిన రోజు నేడు ( డిసెంబరు 13) ఈ సందర్బంగా ఆయనకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. అటు ఫ్యాన్స్‌, ఇటు టాలీవుడ్‌ పెద్దలు వెంకీని అభినందనల్లో ముంచుత్తుతున్నారు. (వెంకీ మామకు బర్త్‌డే శుభాకాంక్షలు, మోషన్‌ పోస్టర్‌ అదిరిపోయిందిగా!

ముఖ్యంగా దగ్గుబాటి వారి మరో వారసుడు  టాలీవుడ్‌ భల్లాల దేవ  రానా ఒక మోషర్‌ పోస్టర్‌ను  ట్విట్‌ర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతోపాటు మెగాస్టార్‌ చిరంజీవి, వరుణ్‌ తేజ్‌ , హీరోయిన్‌ ఖుష్బూ,  ఇతర నటీనటులతోపాటు,  మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, డీఎస్‌పీ, తమన్‌ తదితరులు బర్త్‌డే విషెస​ తెలుపుతూ ట్విట్‌ చేశారు.  నులి వెచ్చని నీ స్నేహంతో నాముఖంపై చిరునవ్వును ఉంచుతున్న మిత్రమా..థ్యాంక్స్‌.మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్!! అంటూ చిరు ట్వీట్‌ చేశారు. అలాగే రానా నాయుడు  నెట్‌ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్‌లోని వెంకటేష్  ఫస్ట్‌లుక్‌ కూడా సందడి చేస్తోంది. ‘రానా నాయుడు’  వెబ్‌సిరీస్‌లో బాబాయ్‌ అబ్బాయిలు వెంకీ, రానా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement