అంజనాద్రి కోసం సాహసాలు

HanuMan Release Date Postponed - Sakshi

అంజనాద్రి కోసం అహార్నిశలు కష్టపడ్డారు తేజ సజ్జా. అంజనాద్రి రక్షణకు ఈ యువ హీరో ఎలాంటి సాహసాలు చేశాడు అనేది ‘హను–మాన్‌’ సినిమాలో చూడాలి. తేజ సజ్జా, అమృతా అయ్యర్‌ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్‌’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 12న రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ‘అంజనాద్రి’ అనే ఊహాత్మక ప్రదేశం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హను–మాన్‌’.

హనుమంతుని శక్తులను పొంది అంజనాద్రి కోసం కథానాయకుడు ఎలా పోరాడాడనేది చిత్రకథాంశం. ‘‘హను–మాన్‌’ టీజర్‌పై ప్రేక్షకులు చూపించిన ప్రేమ మా బాధ్యతను బాగా పెంచింది. గ్రాఫిక్స్‌ వర్క్స్‌ పెండింగ్‌ ఉండటం వల్ల ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్‌ వరల్డ్‌గా హను–మాన్‌ చిత్రం రిలీజ్‌ కానుంది. వినయ్‌ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌరహరి, అనుదీప్‌ దేవ్, కృష్ణ సౌరభ్, కెమెరా: శివేంద్ర, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అస్రిన్‌ రెడ్డి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top