‘అందరూ భయపడ్డారు, హన్సిక ఒక్కరే ధైర్యం చేశారు’

Hansika My Name Shruthi Movie Started in Hyderabad - Sakshi

కథానాయిక హన్సిక నటిస్తున్న లేడీ ఓరియంటెడ్‌ చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. ‘ది హిడెన్‌ ట్రూత్‌’ అన్నది ట్యాగ్‌లైన్‌. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, రేవతి క్లాప్‌ ఇచ్చారు. వంశీ గౌరవ దర్శకత్వం వహించారు. హన్సిక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాలతోనే నా ప్రయాణం మొదలైంది. టాలీవుడ్‌ నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’ విషయానికొస్తే.. స్వేచ్ఛ, స్వాతంత్య్రాలతో ధైర్యంగా తన మనో భావాలను వ్యక్తపరచే మనస్తత్వం కలిగిన శ్రుతి పాత్రలో నటిస్తున్నాను.

ప్రేక్షకులు ఊహించలేని మలుపులతో సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘తన జీవితంలో ఎదురైన చెడు సంఘటనలు, సంఘర్షణల నుంచి శృతి ఎలా బయటపడ్డారన్నదే ఈ చిత్ర కథ. రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం’’ అన్నారు శ్రీనివాస్‌. ‘‘హన్సికకి జోడీగా నటించడం హ్యాపీ’’ అన్నారు సాయితేజ. ‘‘శ్రుతి పాత్ర చేయడానికి చాలామంది భయపడ్డారు.. కానీ హన్సిక ధైర్యంగా ఒప్పుకున్నారు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం మార్క్‌ కె. రాబిన్ అందిస్తున్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top