
మార్త క్రియేషన్స్ బ్యానర్ ఫై ఓం ప్రకాష్ మార్త నిర్మాణ దర్శకత్వంలో నిర్మితమైన చిత్రం గుణసుందరి కథ. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలయింది. ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని అంతర్లీనంగా టచ్ చేస్తూ రియాలిస్టిక్ అప్రోచ్ తో యువతను ఇంకా ఫ్యామిలీ ని ఆకట్టుకునే థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు.
(చదవండి: దర్శకుడి తనయుడు హీరోగా 'హిట్ లిస్ట్'.. విలన్‌గా గౌతమ్ మీనన్ )
నేటి యువతకు కావల్సి అన్నీ అంశాలు ఉన్న చిత్రం ఇది. మహిళా ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుందనీ ఆలోచింపజేస్తుందని చిత్రం యూనిట్ విశ్వసిస్తోంది. ఇక ఈమూవీలో సునీత సద్గురు, ఆనంద చక్రపాణి, రేవంత్ త్రిలోక్, కార్తీక్ సాహస్, ఉదయ్ భాస్కర్, నరేంద్ర రవి, లలితా రాజ్,అక్షయ్ ముఖ్య పాత్రలు పోషించారు.