
మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం.. అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో దృశ్యం-3 కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన దర్శకుడు జీతూ జోసెఫ్ స్క్రిప్ట్ పూర్తయిందని తెలిపారు.
అయితే దృశ్యం-3 మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే చిత్రీకరణ ప్రారంభం కానుందని జీతూ జోసెఫ్ తెలిపారు. అయితే ఆడియన్స్‌కు మాత్రం గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ మూవీపై మొదటి రెండు పార్ట్స్‌లా ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ సినిమా నుంచి ఎక్కువగా ఆశించవద్దని కోరారు.
జీతూ జోసెఫ్ మాట్లాడూతూ.. 'రెండవ భాగం దృశ్యం-2లా ఈ సినిమాను ఆశించవద్దు. అలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే నిరాశ చెందుతారు. ఇప్పుడు రాబోయే భాగం 'దృశ్యం' చిత్రాల మైండ్ గేమ్‌కు భిన్నంగా ఉండనుంది. దృశ్యం 3 కథాంశాలపై తక్కువ దృష్టి సారించి.. కథలోని మెయిన్ పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాం. దృశ్యం 1, 2 సినిమాలతో నేను సంతోషంగా ఉన్నా. 'దృశ్యం 3' కూడా మంచి సినిమా అవుతుంది. బాక్సాఫీస్ గురించి నాకు తెలియదు'అని వివరించారు. ఈ మూవీతో పాటు జీతూ జోసెఫ్ మరో రెండు ప్రాజెక్టులను తెరెకెక్కిస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లో వస్తోన్న మిరాజ్ ఈనెల 19న విడుదల కానుంది. అంతేకాకుండా జోజు జార్జ్‌తో 'వలతు వశతే కల్లన్' ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.
కాగా.. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు.