ఫహాద్ ఫాజిల్ హీరోగా, బేబి సారా, సౌరభ్ సచ్‌దేవ్ ఇతర పాత్రలు పోషించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఈ సినిమాని సెప్టెంబరు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వాయిదా వేసి, అక్టోబరు 2న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ మంగళవారం ప్రకటించింది.
‘‘వైవిధ్యమైన పాత్రల్లో నటించి, విలక్షణ నటుడిగా పేరు పొందిన ఫహాద్ ఫాజిల్ నటించిన ఫ్యాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. టీజర్ ఇప్పటికే సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ‘కేకు వాకు...’ అనే వీడియో సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభించింది’’ అని యూనిట్ పేర్కొంది.


