ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్ | Director Sangeeth Sivan Passed Away | Sakshi
Sakshi News home page

Sangeeth Sivan: ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన స్టార్ డైరెక్టర్

Published Wed, May 8 2024 9:09 PM | Last Updated on Thu, May 9 2024 2:12 PM

Director Sangeeth Sivan Passed Away

ప్రముఖ దర్శకుడు సంగీత శివన్ (61) తుదిశ్వాస విడిచారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఈ క్రమంలోనే మలయాళ, హిందీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

(ఇదీ చదవండి: పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?)

కేరళకు చెందిన సంగీత్ శివన్.. 1990లో 'వ్యూహం' చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యోధ, గంధర్వం, నిర్ణయం, స్నేహపూర్వం అన్న లాంటి మలయాళ సినిమాలతో పాటు అప్నా సప్నా మనీ మనీ, క్లిక్, యమ్ల పగ్ల దీవానా 2 తదితర హిందీ మూవీస్ చేశారు. చివరగా 2019లో 'భారం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు.

సంగీత శివన్ సోదరుడు సంతోష్ శివన్.. ఇప్పటికే సినిమాటోగ్రాఫర్‌గా చాలా పేరు తెచ్చుకున్నారు. దర్శకుడిగానూ కొన్ని మూవీస్ చేశారు. ఇక సంగీత్ శివన్ చనిపోయారని వార్త తెలిసిన తర్వాత బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్ ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement