పుట్టిన రోజు నాడు భోరున ఏడుస్తున్న ఆర్జీవీ!

Director Ram Gopal Varma deathday comments on his birthday - Sakshi

పుట్టినరోజు కాదు..నా డెత్‌ డే : ఆర్జీవీ

 ఒక ఏడాది చచ్చిపోయింది..ట్విటర్‌లో  సంచలన పోస్ట్‌

సాక్షి హైదరాబాద్‌:  వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్‌, 7). ఈ సందర్భంగా సినీవర్గానికి చెందిన పలువురితో పాటు, ఆయన అభిమానులు రామూకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో  వార్తల్లో నిలిచే ఆర్జీవీ మరోసారి తనదైన స్టయిల్‌లో తన పుట్టిన రోజు గురించి చెప్పుకొచ్చాడు.  ఈ రోజు నా బర్త్‌డే కాదు..వాస్తవానికి నా డెత్‌ డే.. ఎందుకంటే నా ఆయుష్షులో ఇక సంవత్సరం తగ్గిపోయింది అంటూ బుధవారం ట్వీట్‌ చేశారు. ఏడుపుమొహం ఎమోజీలను పోస్ట్‌  చేశాడు. దీంతో వార్నీ... ఆర్జీవీ నీరూటే సెపరేటయ్యా.. కానీ.. అలాగే కానీ..అంటూ ఫ్యాన్స్‌ ఫన్నీగా  కమెంట్‌  చేస్తున్నారు. 

కాగా  హారర్‌, థ్రిల్లర్‌, పొలిటికల్,  బయోపిక్స్‌‌ ఇలా  అనేక జానర్లలో విలక్షణ రీతిలో బాలీవుడ్‌, టాలీవుడ్‌ను  ఏలుతున్న ఆర్జీవీ  శివ, రంగీలా, మనీ , గులాబీ, క్షణక్షణం, దెయ్యం, సత్య, సర్కార్ ‌లాంటి అనేక సినిమాల ద్వారా తన స్టయిల్‌ను ప్రేక్షకులకు రుచిచూపించాడు. తాజాగా   ‘ఆర్జీవీ దెయ్యం' పేరుతో మరో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top